తెలుగు ఇండస్ట్రీలో నటినటులు ఒక టైంలో ఒక వెలుగు వెలిగిన వారు ఉన్నట్టుంది  ఫేడ్ అవుట్ అవుతూ ఉంటారు. సినిమాలు ఫెయిల్ అవ్వడం లేదంటే కొన్ని పర్సనల్ విషయాలు అలాగే సినిమాలలో అవకాశాలు రాకపోవడం ఇలా అనేక కారణాలవల్ల ఉన్నట్టుంది ఫేడ్ అవుతూ ఉంటారు.

కొన్ని క సార్లు ఎక్కడ ఉన్నారు వారు ఏం చేస్తున్నారు అన్నది కూడా తెలియకుండా కనిపించకుండా పోతూ ఉంటారు. అటువంటి వారిలో క్యూట్ హీరోయిన్ హీరోయిన్ అయిన కమలిని ముఖర్జీ కూడా ఒకరు. కమలిని ముఖర్జీ పేరు వినగానే ముందుకు వచ్చేది ఆమె అందం. ఆమె అందంతోనే విపరీతమైన పాపులారిటీని కూడా సంపాదించుకుంది.

స్కిన్ షో కి దూరంగా ఉంటూ క్లాసిక్ మూవీలో తోనే ఆమె ఆకట్టుకుంటూ వచ్చింది. అంతే కాకుండా ఈ ముద్దుగుమ్మ నేచురల్ బ్యూటీగా కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఈమెకు హాట్ ఆఫర్లు ఎన్ని వచ్చినా కూడా నో చెబుతూ నే వచ్చింది. ఒకవేళ హాట్ ఆఫర్లకు కమలిని ముఖర్జీ ఓకే చెప్పి ఉంటే సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికీ కూడా ఆమె కంటిన్యూ అవుతూ ఉండేదేమో. అందుకే చాలా తొందరగా సినిమా ఇండస్ట్రీని ఆమె వదిలి వెళ్ళిపోయింది. కమలిని ముఖర్జీ సినిమాలకు దూరం అయ్యే దాదాపుగా అయితే ఆరేళ్లు అవుతోంది. ప్రస్తుతం ఆమె కు వయసు 42 సంవత్సరాలు. సినిమా ఇండస్ట్రీకి దూరమైన తర్వాత ఆమె ఎక్కడ కూడా కనిపించలేదు. కనీసం ఆమె గురించి వార్తలు అయినా రాలేదు.

దాంతో కమలిని ముఖర్జీ అభిమానులు ఆమె గురించి గూగుల్ లో వెతకగా కొన్ని విషయాలు అయితే బయటకు వచ్చాయి. ఈమెకు అవకాశాలు తగ్గుతున్నాయి గమనించిన ఆమె తన సోదరులతో కలిసి మిర్రర్ మిర్రర్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చేసి ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా బ్యూటీ వీడియోస్ షేర్ చేస్తూ ఎంతో ఫేమస్ అయ్యింది. ఆ యూట్యూబ్ ఛానల్ కూడా కొద్ది రోజుల్లోనే చాలా ఫేమస్ అయ్యింది. తర్వాత తనకు ఎంతో ఇష్టమైన బేకరీ బిజినెస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చిందని తెలుస్తుంది.. బేకింగ్ అంటే కమిలిని ముఖర్జీకి ఎంతో ఇష్టమని సమాచారం.. దాంతో ఆమె వరల్డ్ ఫేమస్ కేక్ బేకింగ్ టెక్నిక్స్ నేర్చుకొని మరి ఇండియాలో పరిచయం చేస్తోందటా.ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ కూడా బిజినెస్ లలో బాగా దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఈ ముద్దుగుమ్మకు సినిమాలలో మరొకసారి అవకాశాలు దొరికితే తరువాత ఇన్నింగ్స్ ని మొదలు పెట్టడానికి రెడీగా ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: