
అయితే 2009 వరకు వరుసగా సినిమాలు చేసిన అంకిత.. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి దూరమైంది. ఆమె చివరిసారిగా 2009లో వచ్చిన పోలీస్ అధికారి సినిమాలో కనిపించింది. ఆ తర్వాత చిత్రాలకు ఆమె పూర్తిగా దూరమైంది. ప్రస్తుతం ఆమె ఎలా వుందో తెలుసా…
అంకిత చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చింది.. అప్పట్లో ఫేమస్ అయిన రస్నా యాడ్ లో కూడా నటించి బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటించింది. ఆ తర్వాత వైవీఎస్ చౌదరి తెరకెక్కించిన లాహిరి లాహిరి లాహిరిలో తో ఆమె వెండితెరకు హీరోయిన్ గా పరిచయమైంది. ఈ సినిమా అద్భుత విజయం సాధించింది.దీంతో ఆమెకు తెలుగులో భారీ అవకాశాలు వచ్చాయి.
అలాగే ఎన్టీఆర్ మరియు జక్కన్న కాంబోలో వచ్చిన సింహాద్రిలో కూడా ఆమె నటించింది.కేవలం తెలుగులోనే కాకుండా ఆమె తమిళంలోనూ కొన్ని చిత్రాల్లో నటించి మెప్పించింది. అప్పట్లో అంకితకు ఫాలోయింగ్ కూడా బాగా ఉండేది. అయితే వరుస హిట్స్ అందుకున్న ఆమె.. ఆ తర్వాత వరుస ప్లాపులను కూడా అందించింది.. దీంతో ఆమె కు అవకాశాలు తగ్గాయి. ఆ తర్వాత పూణెకు చెందిన వ్యాపారవేత్త అయిన విశాల్‌ను పెళ్లి చేసుకుంది అంకిత. ఇక తర్వాత సినిమాలకు దూరం అయింది.. ప్రస్తుతం ఆమె డైమండ్స్ వ్యాపారాన్ని చూసుకుంటూ ఫ్యామిలీతో బాగా కాలం గడుపుతుంది.