టాలీవుడ్ నుంచి పాన్ ఇండియన్ సినిమాలు చాలానే వస్తున్నాయి. అందుకే మన సౌత్ సినిమా స్థాయి ముఖ్యంగా టాలీవుడ్ స్థాయి కూడా బాగా పెరిగింది.

దీంతో మన ఇండస్ట్రీ నుండి భారీ పాన్ ఇండియన్ సినిమాలు కూడా తెరకెక్కుతున్నాయి.. వీటిపై మంచి అంచనాలు కూడా నెలకొన్నాయి.. మరి మన స్థాయి పెరగడంతో మన స్టార్ హీరోలతో నటించేందుకు బాలీవుడ్ బ్యూటీలు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ క్రమంలోనే మన స్టార్ హీరోలతో నటించాలని ఉంది అని బిటౌన్ ముద్దుగుమ్మలు చెబుతూ మన హీరోల అవకాశాల కోసం బాగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది మన తెలుగు స్టార్స్ తో కూడా నటిస్తున్నారు. మరి బాలీవుడ్ ముద్దుగుమ్మల్లో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా ఉందని తెలుస్తుంది... ఈమె కూడా చాలా రోజులుగా తెలుగు సినిమా చేయడం కోసం ఎదురు చూస్తుంది.

ఈ క్రమంలోనే ఈమెకు అదిరిపోయే అవకాశం కూడా వచ్చింది.. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులో జాన్వీ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది అని వార్తలు కూడా వచ్చాయి. ఈమె ఈ సినిమా ఒప్పుకుంది అని అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం అంటూ టాక్ కూడా వచ్చింది.. మరి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఈమె చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుందని తెలుస్తుంది.. మిగతా ప్రోజెక్టుల కంటే ఎన్టీఆర్ తో చేసే సినిమా కోసమే డేట్స్ కూడా ఎక్కువ కేటాయించింది అని ఈ సినిమా ఈమెకు మొదటి పాన్ ఇండియన్ సినిమా కాబోతుండడంతో జాన్వీ చాలా ఉత్సాహంగా ఉందని తెలుస్తుంది.. మరి మార్చి నుండి రెగ్యురల్ షూట్ స్టార్ట్ కానుందట.. ఈ సినిమా 2024, ఏప్రిల్ 5న విడుదల చేయనున్నారు అని సమాచారం.. ఇక ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తుందని తెలుస్తుంది. అలాగే అనిరుద్ రవిచంద్రన్ కూడా సంగీతం అందిస్తున్నట్లు సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి: