అయితే ఇలా యువ హీరోలతో పాటు స్టార్ హీరోలు అందరిని కూడా బాలయ్య తన కార్యక్రమానికి పిలుస్తున్నాడు. కొంతమంది రాజకీయ నాయకులను కూడా పిలిచారు. కానీ ఇప్పటివరకు ఏ నందమూరి హీరో అటు అన్ స్టాపబుల్ కార్యక్రమంలో కనిపించలేదు అని చెప్పాలి. ఇప్పటికే రెండవ సీజన్ ముగింపు దశకు చేరుకున్న నందమూరి హీరో బాలయ్య షో లో కనిపిస్తాడు అన్న ఆశ అభిమానులకు తీరలేదు. అయితే నందమూరి వారసులు అయినప్పటికీ ఇక ఈ షోకి రాకపోవడానికి కళ్యాణ్ రామ్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. మీరు ఎందుకు మీ బాబాయి అన్ స్టాపబుల్ షోలో పాల్గొనలేదు అంటూ యాంకర్ ప్రశ్నించగా.. మీరు ఈ ప్రశ్నని ఆహా వారిని అడిగితే బాగుంటుంది అంటూ సమాధానం చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే ఆహా నుండి ఆహ్వానం లేకపోవడంతోనే ఇక నందమూరి హీరోలు అన్ స్టాపబుల్ కు వెళ్లలేదు అన్నది తెలుస్తుంది.
ఇక దీని బట్టి చూస్తే మూడవ సీజన్లో నందమూరి హీరోలు అన్ స్టాపబుల్ కార్యక్రమంలో కనిపించే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. అంతేకాదు మీ నుండి పిలుపు రావాలి కానీ వచ్చేస్తాను అంటూ ప్రభాస్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ కూడా చెప్పడంతో.. ఇక మూడో సీజన్ లో రామ్ చరణ్ ని కూడా పిలిచే ఛాన్స్ ఉందట. మరి మెగాస్టార్ ఈ కార్యక్రమానికి వస్తాడా లేదా అన్న దానిపై మాత్రం ఆసక్తికర చర్చ జరుగుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి