
కమెడియన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి హీరోగా మారి తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ను సంపాదించుకున్నారు సునీల్.. విలన్ అవుదామని వచ్చిన ఈయన టాప్ కమెడియన్ గుర్తింపు సంపాదించుకున్నారు. నువ్వే కావాలి సినిమాతో పరిచయమైన ఈయన మనసంతా నువ్వే , నువ్వు నేను వంటి సినిమాలతో స్టార్ కమెడియన్ అయిపోయారు. అప్పట్లో సంవత్సరానికి 20కి పైగా సినిమాలలో నటించేవారు. ఇకపోతే నంది అవార్డుతో పాటు పలు ఫిలింఫేర్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. సునీల్.
సినిమాల్లోకి రాకముందు భీమవరంలో ఉన్న సునీల్ స్నేహితుడు త్రివిక్రమ్ ప్రోత్సాహంతో ఇండస్ట్రీకి వచ్చారు. ఇప్పటికీ అదే జోరు చూపిస్తూ స్టార్ విలన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే సునీల్ పెళ్లి చేసుకోవడం జరిగింది.. అసలు విషయంలోకి వెళితే ఐదు సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయిన సునీల్ అప్పటినుంచి అమ్మ లాలనలోనే పెరిగి పెద్దయ్యాడు.. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. అమ్మాయి పేరు శృతి ఇందుకూరి. చాలా సాంప్రదాయంగా హీరోయిన్లను మించిన అందంతో సునీల్ భార్య ఉందని అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు. అయితే సునీల్ బంధువుల అమ్మాయిని భార్యగా చేసుకోవడం గమనార్హం.