తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎన్నో విజయాలను అందుకొని మంచి జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో ఈ నగరానికి ఏమైంది మూవీ తో కెరియర్ ను మొదలు పెట్టి పలకనామ దాస్ మూవీ తో మాస్ హీరోగా గుర్తింపును తెచ్చుకొని ... ఆ తర్వాత ఎన్నో క్లాస్ మూవీ లలో హీరో గా నటించి క్లాస్ హీరోగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. 

ఇది ఇలా ఉంటే విశ్వక్ ఆఖరుగా ఓరి దేవుడా అనే మూవీ లో హీరోగా నటించాడు. వెంకటేష్ కీలకపాత్రలో నటించిన ఈ మూవీ కి అశ్విత్ మరిమత్తు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ పర్వాలేదు అనే రేంజ్ విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ హీరో దాస్ కా దమ్కి అనే మాస్ ఎంటర్టైనర్ సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి విశ్వక్ దర్శకత్వం కూడా వహించడం విశేషం. నివేత పేతురాజ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను ఈ సినిమ బృందం విడుదల చేయగా వాటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

మూవీ ని మార్చి 22 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన వివరాలను విడుదల చేసింది. ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ వేడుకను శిల్పకళా వేదిక హైదరాబాద్ లో మార్చి 17 వ తేదీన సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నట్లు ... ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రానున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన పనులు ఫుల్ స్పీడ్ గా జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: