
లేటెస్ట్ గా విడుదలైన ఈ మూవీని అసలు ఎందుకు తీసారు అంటూ చాలమంది కామెంట్స్ చేస్తున్నారు. గత సంవత్సరం విడుదలైన బ్లాక్ బష్టర్ మూవీ ‘కేజీ ఎఫ్’ ను పక్కన పెట్టుకుని ఒక జరాక్స్ కాపీలా 100 కోట్ల ఖర్చుతో ఈసినిమాను తీసారా అంటూ కొందరు ఆశ్చర్యపోతున్నారు. ఉఫేంద్ర కన్నడ టాప్ స్టార్ ‘కేజీఎఫ్’ ను చూసి తనకు అలాంటి సినిమా కావాలని కోరుకున్నాడా లేదంటే యష్ నటించినట్లుగా తాను ఎందుకు నటించలేను అని ప్రయత్నించాడ అన్నవిషయాలు ఎవరికీ అర్థంకాని విషయంగా మారాయి.
‘కేజీ ఎఫ్’ తరహా కథ యష్ బాడీ లాంగ్వేజ్ ని ఉపేంద్ర ప్రతి విషయంలోను అనుసరించాడు. ఎక్కడా ఒరిజనాలిటీ ఉండదు ప్రతి విషయంలోను కాపీ మాత్రమే కనిపిస్తుంది. ఈసినిమాకు ఎంచుకున్న కలర్ థీమ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఎడిటింగ్ ప్యాటర్న్ ఇలా ప్రతి విషయంలోనూ కాపీ మాత్రమే కనిపిస్తుంది. ఈసినిమాను చూస్తున్న సగటు ప్రేక్షకుడు ఈసినిమాకు ఎందుకు వచ్చామో అర్థం అవ్వక గగ్గోలు పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఉపేంద్ర తో పాటు సుదీప్ శివరాజ్ కుమార్ లాంటి పెద్ద హీరోలు ఈసినిమాలో నటించినప్పటికీ ఈసినిమా పాన్ ఇండియా లెవల్ లో భారీ ఫ్లాప్ గా మారడంతో కేవలం 100 కోట్లు ఖర్చుపెట్టి పాన్ ఇండియా సినిమా తీస్తే అది బాగోకపోయినా జనం చూడరు అన్న విషయం మరొకసారి అందరికీ అర్థం అయ్యేలా ‘కబ్జా’ సినిమా ఫలితం కనిపిస్తుంది..