తెలుగు ప్రజల మొదటి పండుగ ‘ఉగాది’ రేపు రాబోతున్న ఉగాది పండుగరోజున టాప్ హీరోల అభిమానులకు జోష్ ను కలిగించడానికి టాప్ హీరోలతో సినిమాలు తీస్తున్న దర్శక నిర్మాతలు చేయబోతున్న హంగామాకు సంబంధించిన వార్తలు లీక్ అవుతున్నాయి. మహేష్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో షూటింగ్ జరుపుకుంటున్న మూవీకి సంబంధించిన టైటిల్ ఎనౌన్స్ మెంట్ ఉగాది పండుగరోజున ఉంటుందని ప్రచారం జరుగుతోంది.


ఒకవేళ అనుకోని పరిస్థితులు వల్ల ఈమూవీ టైటిల్ ఎనౌన్స్ చేయడం కుదరకపోతే ఆరోజు ఈమూవీలోని మహేష్ లుక్ ను విడుదల చేస్తారని సంకేతాలు వస్తున్నాయి. అదేవిధంగా బాలకృష్ణ అనీల్ రావిపూడిల సినిమాకు సంబంధించి టైటిల్ అనౌన్స్ మెంట్ ఆరోజు ఉంటుందని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. చిరంజీవి ‘భోళాశంకర్’ కు సంబంధించిన ఒక టీజర్ ను అదేవిధంగా పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ లు కలిసి నటిస్తున్న మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఉగాది రోజున విడుదల చేస్తారు అన్న ప్రచారం జరుగుతోంది.


ఈమధ్య వరస ఫ్లాప్ లతో సంతమతమైపోతున్న నాగార్జున కూడ తన లేటెస్ట్ మూవీ ప్రకటనకు ఉగాది పండుగను సెంటిమెంట్ గా ఫాలో అవుతున్నట్లు టాక్. ఇక జూనియర్ అభిమానులు గగ్గోలు పెడుతున్న జూనియర్ కొరటాల శివల మూవీకి సంబంధించిన అప్ డేట్ ను కూడ ఉగాది పండుగరోజునే ఇస్తారు అని అంటున్నారు. ఈ సినిమాలే కాకుండా ‘శాకుంతలం’ మూవీకి సంబంధించిన మరొక ట్రైలర్ విడుదల ఆరోజు ఉంటుంది అని అంటున్నారు.


ఇక అదేరోజు అనేక చిన్న మీడియం రేంజ్ కొత్త సినిమాల ప్రారంభోత్సవాలు ఉగాది రోజుల వివిధ స్టూడియోలలో జరుగుతాయి అన్న వార్తలు వినిపిస్తున్నాయి. గత కొన్ని వారాలుగా ప్రేక్షకులు లేక బోసిపోతున్న ధియేటర్లకు కళరావడానికి ఈ పండుగ రోజున విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ రాబోతోంది. దానికి పోటీగా ఉగాదిని నమ్ముకుని కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ కూడ విడుదల అవుతూ ఉండటంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉగాది సందడి చాల ఎక్కువగానే ఉండబోతోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: