తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ నగరానికి ఏమైంది మూవీ ద్వారా నటుడి గా మంచి గుర్తింపును తెచ్చుకున్న విశ్వక్ సేన్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటుడు గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే విశ్వక్ కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా వీలు చిక్కినప్పుడల్లా సినిమాలకు దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. అందులో భాగంగా కొంత కాలం క్రితం విశ్వక్ "పలకనామ దాస్" అనే మూవీ లో హీరో గా నటించడం మాత్రమే కాకుండా ... ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ ద్వారా విశ్వక్ దర్శకుడి గా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా విశ్వక్ "దాస్ కా దమ్కీ" అనే మూవీ లో హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ మార్చి 22 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సినిమాలో నివేత పేతురాజ్  హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది.

సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు యు / ఏ సర్టిఫికెట్ లభించింది. అలాగే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. ఈ సినిమా 3 గంటల 31 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ నుండి ఇప్పటికే చిత్ర బృందం కొన్ని ప్రచారాలు చిత్రాలను విడుదల చేయగా అవి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తో విశ్వక్ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: