ఎన్టీఆర్ ఏదైనా మాట్లాడే ముందు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారనే విషయం తెలిసిందే. విశ్వక్ సేన్ తన స్వీయ దర్శకత్వంలో సినిమాలు చేయడం పై ఎన్టీఆర్ స్పందిస్తూ అలా చేయవద్దని సూచించడం అయితే జరిగింది.

విశ్వక్ సేన్ ధమ్కీ రిజల్ట్ ను బట్టి డైరెక్షన్ కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. అయితే నివేదా పేతురాజ్  మాత్రం విశ్వక్ సేన్ కు డైరెక్టర్ గా కెరీర్ ను కొనసాగించాల ని సూచించినట్లు తెలుస్తుంది.

దాస్ కా ధమ్కీ విశ్వక్ సేన్ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని నివేదా పేతురాజ్ కూడా తెలిపారు. ఓరి దేవుడా సినిమా లో నాకు ఛాన్స్ వచ్చిందని అయితే రోల్ సరిపోదని నో చెప్పానని కూడా ఆమె అన్నారు. విశ్వక్ సేన్ డైరెక్ట్ చేయడం మరీ స్పెషల్ అని యూనిక్ స్టోరీ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందని నివేదా పేతురాజ్ పేర్కొన్నారటా.ప్రొడ్యూసర్ పాత్ర కు విశ్వక్ న్యాయం చేశారని ఏం కావాలన్నా కూడా సమకూర్చారని నివేదా తెలిపారు.

త్రివిక్రమ్ తర్వాత అంతటి ఎనర్జీ ఉన్న దర్శకుడు విశ్వక్ సేన్ అని చెప్పుకొచ్చింది.డైరెక్టర్ గా అతనికి మంచి భవిష్యత్తు అయితే ఉందని నివేదా తెలిపారు. అయితే ఎన్టీఆర్ మాట ను పట్టించు కోవా అంటూ కొంతమంది సోషల్ మీడియా లో కామెంట్లు కూడా చేస్తున్నారు. ఎన్టీఆర్ కామెంట్లు విని కూడా నివేదా ఈ విధంగా రియాక్ట్ కావడం ఏంటని కొంతమంది సోషల్ మీడియా లో కామెంట్లు కూడా చేస్తున్నారు.

ధమ్కీ సక్సెస్ సాధిస్తే తెలుగు లో నివేదా పేతురాజ్ బిజీ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ప్రస్తుతం విశ్వక్ సేన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయని సమాచారం.. విశ్వక్ సేన్ కెరీర్ పరంగా ఇంకా బిజీ కావాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: