యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం వరుస మూవీ లను ఓకే చేస్తూ వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. సాయి తేజ్ ఆఖరిగా దేవకట్ట దర్శకత్వంలో రూపొందిన రిపబ్లిక్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. అలాగే ఈ మూవీ లో నటనకు గాను సాయి తేజ్ కు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంశలు కూడా లభించాయి. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సాయి తేజ్ "విరూపాక్ష" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని ఏప్రిల్ 21 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లను ఫుల్ స్పీడ్ లో నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.

 తాజాగా ఈ మూవీ నుండి చిత్ర బృందం "నచ్చావులే నచ్చావులే" అనే మొదటి లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసింది. ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ ప్రస్తుతం లభిస్తుంది. ఇది ఇలా ఉంటే రిపబ్లిక్ మూవీ తర్వాత చాలా చాలా గ్యాప్ తీసుకొని సాయి తేజ్ నటించిన మూవీ కావడం ... అలాగే ఈ మూవీ లోని ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రస్తుతం తెలుగు సినీ ప్రేమికుల భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకొని మంచి విజయాన్ని అందుకుంటుందో లేదో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: