తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటించినది చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచు గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్న వారిలో భాను శ్రీ మెహ్రా ఒకరు . ఈ ముద్దు గుమ్మ అల్లు అర్జున్ హీరో గా గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందిన వరుడు మూవీ తో వెండి తెరకు పరిచయం అయిం ది. ఈ మూవీ విడుద లకు ముందు ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకోవడంతో ఈ సినిమా భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది.

అలా భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టు కోలేక పోయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలక్షన్ లను అందుకోలేక అపజయం పలు అయింది. అలాగే ఈ మూవీ ద్వారా భాను శ్రీ కి కూడా పెద్దగా గుర్తింపు లభించ లేదు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించిన భాను ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సినిమాలకే చాలా వరకు దూరం అయింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ సినిమా ల్లో హీరోయిన్ ల వయసు ప్రభావం పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తాజాగా భాను శ్రీ వయస్సు మీరిన హీరోయిన్ లను తల్లి పాత్రల కే పరిమితం చేస్తున్న ఇండస్ట్రీ హీరోలను మాత్రం అదే స్థానం లో కొనసాగిస్తుంది అని ఆవేదనను వ్యక్తం చేసింది. పాత పద్ధతి ఇప్పటికైనా స్వస్తి పలకండి అంటూ భాను శ్రీ సూచించింది . అన్ని వయసుల వారిని కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అని భాను శ్రీ తాజాగా తెలిపింది .

మరింత సమాచారం తెలుసుకోండి: