తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్న మురగదాస్ ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తీసి అభిమానులను సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. తనదైన టేకింగ్ తో ప్రత్యేకమైన ఇమేజ్ మురగదాస్ సంపాదించుకున్నాడు అని చెప్పాలి. అయితే తెలుగులో కూడా పలువురు హీరోలతో సినిమాలు తీశాడు. అయితే మురగదాస్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుంది అంటూ ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్నాయి.


 ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు మురుగదాస్. 16 ఆగస్టు 1947 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కరోనా కారణంగా అందరికీ గ్యాప్ వచ్చింది. అందరూ ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వమే చెప్పింది. ఆ సమయంలో చాలా పుస్తకాలు చదివాను.. వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాను. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకున్న అందుకే కాస్త గ్యాప్ వచ్చింది. ఒక హీరో తన కెరియర్ లో  చాలామంది దర్శకులను కలుస్తాడు. అలాగే డైరెక్టర్ కూడా అనేక మంది హీరోలను కలుస్తాడు. ఏదో ఒక సమయంలో ఆ ప్రాజెక్టు మొదలవుతుంది. ప్రస్తుతమైతే ప్రాథమిక దశలోనే ఉంది ఇంతకుమించి నేనేదో చెబితే అదే హెడ్డింగ్ పెడతారు అంటూ మురగదాస్ చెప్పుకొచ్చాడు. ఇక 16 ఆగస్టు 1947 సినిమా కోసం రాత్రి పగలు ఎంతగానో కష్టపడి పని చేస్తాం. ఇక తెలుగులో కచ్చితంగా ఒక సినిమా చేస్తా. ప్రేక్షకుడి అంచనాలు దర్శకుడు క్రియేటివిటీ కలిసి ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు.


 మురగదాస్ మాటల తర్వాత అసలు అల్లు అర్జున్ తో సినిమా ఉంటుందా లేదా అనే విషయంపై అభిమానులు అందరూ కూడా మరింత కన్ఫ్యూజన్లో పడిపోయారు. ఒకవేళ మురగదాస్ అల్లు అర్జున్తో సినిమా చేయాలని అనుకున్నప్పటికీ ఇక అతను బిజీ షెడ్యూల్ కారణంగా ఇక రాబోయే రోజుల్లో ఇది కుదిరే చాన్స్ లేదు అన్నది మాత్రం తెలుస్తుంది. మరి వీరిద్దరి కాంబినేషన్ ఎప్పుడు కుదిరి చివరికి సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: