1980 ప్రాంతాలలో దేవి నవరాత్రులు గణపతి ఉత్సవాలు కృష్ణాష్టమి వేడుకలు జరిగే ప్రాంతాలలో ఆకాలం నాటి ట్రెండింగ్ సినిమాలను రోడ్డు పై స్క్రీన్ పెట్టి రాత్రి సమయంలో సినిమాలు వేసేవారు. ఆసినిమాలను చూడటానికి జనం విపరీతంగా వస్తూ ఉండేవారు. ఆతరువాత టీవి లు ప్రతి ఇంటిలోకి వచ్చేయడంతో రోడ్డు సైడ్ సినిమాలు చూసే జనం పూర్తిగా తగ్గిపోయారు.


ఆతరువాత లేటెస్ట్ గా ఓటీటీ లు కూడ వచ్చేయడంతో జనం సినిమా ధియేటర్లకు రావడమే తగ్గించి వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో ‘బలగం’ సినిమాను తిరిగి పాత పద్ధతిలో చిన్నచిన్న పల్లెటూళ్ళలో ఆవూరి సర్పంచులు తమ ఊరి ప్రజల కోసం తమ ఊరిలోని ఖాళీ ప్రదేశాలలో రాత్రిపూట పెద్ద స్క్రీన్ పెట్టి ఊరంతా చాటింపు వేయించి తమ గ్రామ ప్రజల కోసం ‘బలగం’ ప్రత్యేక ప్రదర్శనలు వేయించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


ఈసినిమాకు సంబంధించిన షో టైంని ముందే చాటింపు వేయడం వల్ల ఆసమయానికి చిన్నా పెద్ద తేడా లేకుండా వందల్లో జనం గుమికూడి బలగంని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రెడ్డిపేట, సంగం, ముద్దాపూర్, దుద్దెడ, లక్ష్మణ్ చందా, ముస్కాల్, ఆశకొత్తూరు, జలాల్ పూర్, రాగన్న గూడెం, గుర్రాలగొంది, కాసారం, పడకల్, బస్వాపూర్ ఇలా తెలంగాణాకు చెందిన అనేక చిన్నచిన్న పల్లెటూర్లలో ‘బలగం’ ప్రత్యేక షోలు వేస్తున్నారు.  ఈ చిన్నచిన్న పల్లెటూర్లలో ఎక్కడా ధియేటర్లు ఉండక పోవడంతో గ్రామస్థులు, సర్పంచులు, పెద్దలు, జాతర నిర్వాహకులు, యువకులు ఇలా అందరూ ఒక్కటై ఇలాంటి ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేసుకుంటున్నారు.


ఈ స్థాయిలో తన ‘బలగం’ మూవీకి స్పందన వస్తుందని ఎంతో అనుభవం ఉన్న దిల్ రాజ్ కూడ ఊహించలేదు అని అంటున్నారు. 4 కోట్ల పెట్టుబడితో తీసిన ఈమూవీ 20 కోట్ల కలక్షన్స్ ను రాబట్టడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. జబర్దస్త్ వేణు ఈమూవీతో ఇండస్ట్రీలో దర్శకుడుగా సెటిల్ అయినట్లే అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: