ఇస్మార్ట్ శంకర్ సినిమాతో రామ్ బ్లాక్ బస్టర్ హిట్టు ఇవ్వడమే కాకుండా తన కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో లైగర్ సినిమాని తెరకెక్కించగా ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తెలకెక్కించి ఘోరమైన డిజాస్టర్ గా మూట కట్టుకున్నారు. ఈ సినిమాతో కొన్ని కోట్ల రూపాయలు నష్టాన్ని మిగిల్చినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ సినిమాతో అటు విజయ్ దేవరకొండతో పాటు ఛార్మి, పూరి జగన్నాథ్ అందరూ కూడా పెద్ద ఎత్తున ట్రోల్ కావడం జరిగింది.
లైగర్ సినిమా ఎఫెక్ట్ వల్ల పూరి జగన్నాథ్ నెక్స్ట్ చేయబోయే సినిమా ఏంటా అంటూ అందరూ ఆశ్చర్యకరంగా ఎదురుచూస్తున్నారు. ఇదంతా ఇలా ఉంటే తాజాగా పూరి జగన్నాథ్ మరొక్కసారి హీరో రామ్ తో ఒక సినిమాను చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.. పూరి జగన్నాథ్ చార్మి బ్యానర్ పైన ఈ సినిమాని నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాపై ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. రామ్ పూరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా అభిమానులను ఎలా ఆకట్టుకుంటుందో అంటూ రామ్ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను తో రామ్ తన 20వ సినిమాలు చేయబోతున్నారు ఈ సినిమా కూడా యాక్షన్ సినిమాగా ఉండబోతోంది విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి