సాధారణంగా బాక్సాఫీస్ వద్ద ఎన్నో సినిమాలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఇలా చిన్న సినిమాగా వచ్చి ప్రతి ఒక్కరి మధిలో చోటు సంపాదించుకున్న సినిమా బలగం. జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇక మనుషుల్లో కనుమరుగైపోతున్న మానవ బంధాలను మరోసారి తట్టి లేపింది. ఇక చిన్న చిన్న గొడవలతో దూరంగా ఉంటున్న అక్క చెల్లెళ్లను, అన్నదమ్ములను దగ్గర చేసింది.



 బంధాలు బంధుత్వాల మధ్య ప్రేమ ఆప్యాయతలు ఎంత బాగుంటాయి అనే విషయాన్ని ఈ సినిమా కళ్ళకు కట్టినట్లుగా చూపించింది అని చెప్పాలి. అయితే ఈ సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే చివర్లో వచ్చే ఓ పాట ఒక ఎత్తు. తోడుగా మా తోడుండి అనే సాంగ్ అయితే కఠినమైన హృదయం కలిగిన వాళ్ళను కూడా కన్నీరు పెట్టించింది. ఇక ఈ సాంగ్ ఎప్పుడు విన్నా కూడా అటు ప్రేక్షకులందరికీ కూడా ఒకే ఫీల్ కలుగుతూ ఉంటుంది. ఇలా ఇంతలా ప్రేక్షకుల గుండెలు పిండేసి కన్నీళ్లు తెప్పించే సాంగ్ ఇటీవల కాలంలో రాలేదు అనడంలోనూ అతిశయోక్తి లేదు.


 అయితే ఇలాంటి ఎమోషనల్ సాంగ్ ని ఇటీవల కమెడియన్స్ స్పూఫ్ చేసి నవ్వులు పూయించారు. ఇటీవల విడుదలైన జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. అయితే జబర్దస్త్ కి అటు బలగం డైరెక్టర్ వేణు గెస్ట్ గా వచ్చారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ ఈ కార్యక్రమంలో ఉన్న ఇతర కమెడియన్స్ గురించి మాట్లాడుతూ.. బలగం సినిమా స్పూఫ్ చేస్తూ పాట పాడాడు. దీంతో అందరినీ ఏడిపించిన పాట ప్రవీణ్ నోట విని ప్రతి ఒక ప్రేక్షకుడు నవ్వుకుంటున్నాడు అని చెప్పాలి. కాగా ఈ ప్రోమో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: