ఒక హీరోయిన్ కు వరసగా మూడు హిట్స్ వస్తే చాలు ఆమెను గోల్డెన్ లెగ్ హీరోయిన్ అంటూ ఆకాశానికి ఎత్తేయడమే కాకుండా ఆమెకు వరసపెట్టి అవకాశాలు కోరుకున్న స్థాయిలో పారితోషికం ఇవ్వడం కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతూ ఉంటారు. అయితే ఈ సెంటిమెంట్ కు భిన్నంగా మళయాళ బ్యూటీ సంయుక్తా మీనన్ కెరియర్ కనిపిస్తోంది.


ఈమె నటించిన ‘భీమ్లా నాయక్’ ‘సార్’ ‘బింబిసార’ లతో పాటు లేటెస్ట్ గా విడుదలైన ‘విరూపాక్ష’ మూవీ కూడ హిట్ అయినప్పటికీ ఇంకా ఇండస్ట్రీలో ఆమె పై మ్యానియా ఏర్పడక పోవడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. హోమ్లీగా ఉంటూ కొంతవరకు గ్లామర్ గా కనిపించే ఈమె అనుకోకుండా సినిమాలోకి వచ్చింది అని అంటారు. మీడియా వర్గాలు ఆమెను ‘నువ్వు సమంత లా ఉంటావు’ అన్న కామెంట్స్ పై స్పందిస్తూ తాను సమంత లా నటిస్తున్నానని కామెంట్ చేస్తే గర్వపడతాను కాని సమంత లా ఉన్నావు అని అంటే తాను పట్టించుకొను అంటోంది.


తన ఇంటి పేరుతో సహా మీడియా వార్తలు వ్రాస్తూ ‘సంయుక్తా మీనన్’ అని పిలవడం తనకు ఇష్టం లేదనీ తన చిన్నప్పుడే తన తల్లి తండ్రి విడిపోవడంతో తన తండ్రి పేరుతో వచ్చిన మీనన్ పదం పై తనకు ఆశక్తిలేదు అని అంటోంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తన సొంతం అయినప్పటికీ తనను వెతుక్కుంటూ అవకాశాలు రాకపోవడం వెనుక ఒక కారణం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.




ఇప్పటికే సంయుక్త తో సినిమా తీసిన వాళ్లు మళ్ళీ ఆమెతో సినిమాలు చేయడానికి ఆశక్తి కనపరచక పోవడానికి ఆమె షూటింగ్ లకు టైమ్ కు రాదు గంట నుంచి రెండు గంటలు ఆలస్యంగా వస్తోంది అంటూ కొందరు చేస్తున్న నెగిటివ్ ప్రచారంలో నిజాలు ఎన్నో తెలియక పోయినా ఆమెకు చెప్పుకోతగ్గ స్థాయిలో అవకాశాలు రాకపోవడం ఇండస్ట్రీలోని చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: