అలా సెలబ్రిటీలు డబ్బుల కోసం ఏదైనా చేస్తే చాలు వెంటనే వాళ్ళని ఏకీపారేస్తూ ఉంటారు.
ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు డబ్బుల కోసం చేయరాని పనులు కూడా చేశారు.అంతేకాకుండా ఆరోగ్యాలను దెబ్బతీసే కొన్ని ప్రాడెక్టుల గురించి కూడా ప్రకటించిన వాళ్ళు ఉన్నారు.
అందుకే సెలబ్రిటీలను డబ్బుల కోసం ఏమైనా చేస్తూ ఉంటారు అని బాగా విమర్శిస్తూ ఉంటారు.అయితే తాజాగా ఇటువంటిదే యాంకర్ శ్యామలకు కూడా ఎదురైంది.
తను కూడా డబ్బు మనిషే అని జనాలు ఓ రేంజ్ లో ఏకీపారిస్తున్నారు.ఇంతకు అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బుల్లితెర యాంకర్ శ్యామల పరిచయం గురించి అందరికీ తెలిసిందే.తన యాంకరింగ్ విధానంతో మంచి గుర్తింపు అందుకుంది.ఇక వెండితెరపై కూడా కొన్ని సినిమాలలో పలు పాత్రల్లో మెప్పించింది శ్యామల.
ఇక ఈమె మరో బుల్లితెర నటుడు నరసింహారెడ్డిని ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఇక శ్యామల సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది శ్యామల.
చిన్న వయసులోనే బుల్లితెరలో అడుగు పెట్టి పలు సీరియల్ లో నటించగా.ఆ తర్వాత వెండితెరపై అవకాశాలు అందుకుంది.
ఇక పలు షోల్లో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.కొన్ని అడ్వర్టైజ్మెంట్ లలో కూడా నటిస్తుంది.
ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉందని చెప్పవచ్చు.శ్యామల ఈమధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారింది.
ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగానే పంచుకుంటుంది.అప్పుడప్పుడు తన బాబు తో చేసిన వీడియోలను, వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటుంది.అంతే కాకుండా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది.
యూట్యూబ్ లో కూడా బాగా వీడియోస్ షేర్ చేస్తూ ఉంటుంది.ఇక ఇప్పటికీ యాంకర్ శ్యామల శరీరంలో ఎటువంటి మార్పులు రాలేదు.
ఇప్పటికీ అంతే అందంగా ఉంటూ సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలు పంచుకుంటూ బాగా హడావుడి చేస్తూ ఉంటుంది.ఇక రీసెంట్ గా విరూపాక్ష సినిమాలో నటించి మంచి మార్కులు సంపాదించుకుంది.ఒకవైపు యాంకర్ గా చేస్తూ మరోవైపు సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటుంది.
అయితే ఇదంతా పక్కనే పెడితే గతంలో శ్యామల రాజకీయపరంగా ఓ పార్టీ తరపున జోరుగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.ఇక ఇప్పుడు కెరీర్ పరంగా బాగా బిజీగా ఉండటంతో రాజకీయాలకు దూరంగా ఉంటుంది.అయితే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఆమె కొన్ని ఫొటోస్ పంచుకోగా ఆ ఫోటోలను చూసిన జనాలు ఆమె అందాన్ని పొగుడుతూ ఉండగా మరికొంతమంది ఆమె రాజకీయం ఎంట్రీ గురించి చర్చలు చేస్తూ కనిపించారు.దీంతో ఓనెటిజన్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఎక్కడ అక్క.ఎలక్షన్స్ ముందు వైసీపీ జెండా పట్టుకొని తిరిగావు.
ఇప్పుడు ఏమయింది అని ప్రశ్నించగా.వెంటనే మరో నెటిజన్.డబ్బులు ఇస్తే కె పాల్ పార్టీ జెండా పట్టుకొని కూడా తిరుగుతారు వీళ్ళు అంటూ దారుణంగా ట్రోల్ చేశారు.దీంతో అక్కడ శ్యామల పరువు పోయినట్లు అనిపించింది.
ఇక శ్యామల అభిమానులు ఆ నెటిజన్ పై బాగా ఫైర్ అవుతున్నారు.తను అటువంటిది కాదు అని.తనకున్న బిజీ షెడ్యూల్ వల్ల ఎటువంటి ప్రచారాలు చేయడం లేదు అని అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి