టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కూడా మంచి మార్కెట్ను ఏర్పరచుకున్న దక్షిణాది హీరోలు చాలా మందే ఉన్నారు.వాళ్లంతా తమ సినిమాలని నేరుగా మన దగ్గర కూడా విడుదల చేస్తున్నారు.ఇక అలాంటి వారిలో కోలీవుడ్ స్టార్ హీరో కార్తి కూడా ఒకడు. చాలా కాలంగా తెలుగు మార్కెట్పై ఫోకస్ చేస్తోన్న కార్తి ఇక్కడ కూడా మంచి విజయాలను అందుకుంటూ దూసుకుపోతోన్నాడు.రిజల్ట్ తో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసే కార్తి.. ఇప్పుడు 'జపాన్' అనే సినిమాలో కూడా నటిస్తోన్నాడు. ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాని 'జోకర్' ఫేం రాజు మురుగన్ తెరకెక్కిస్తున్నాడు. కార్తి 25వ సినిమాగా వస్తున్న దీనికి సంబంధించిన చాలా వరకూ షూటింగ్ ఇప్పటికే పూర్తైంది.ఇక మిగిలిన దాన్ని కూడా త్వరలోనే కంప్లీట్ చేయనున్నారు.క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న 'జపాన్' సినిమాకి సంబంధించిన గ్లింప్స్ వీడియోను కార్తి పుట్టినరోజు సందర్భంగా తాజాగా విడుదల చేయడం జరిగింది. ఇందులో ఈ కోలీవుడ్ స్టార్ హీరో ఉంగరాల జుట్టు రగ్గుడ్ ఫేష్తో సరికొత్త లుక్లో చాలా అట్రాక్టీవ్ గా కనిపించాడు. 


ఇంకా అలాగే అతడి బాడీ లాంగ్వేజ్ కూడా విభిన్నంగా ఉంది.ముఖ్యంగా కార్తి డైలాగ్ డెలివరీ కూడా గతంలో ఎన్నడూ చూడని విధంగా బాగా ఆకట్టుకునేలా ఉంది.ముఖ్యంగా ఈ గ్లింప్స్లో హీరో కార్తి చేస్తోన్న 'జపాన్' పాత్రను బాగా ఎలివేట్ చేసి చూపించారు. ఇందులో చూపించిన విజువల్స్ వచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ అన్ని సరిగ్గా సరిపోయాయి. దీంతో ఈ వీడియోకు అన్ని వర్గాల వాళ్ల నుంచి మంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇది చాలా తక్కువ సమయంలోనే బాగా వైరల్ అవుతోంది. ఇక ఈ గ్లింప్స్ మాత్రం సినిమాపై అంచనాలను అమాంతం పెంచిందనే చెప్పాలి.ఈ మూవీని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్ఆర్ ప్రకాష్ బాబు ఎస్ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ మూవీలో అను ఇమాన్యూయేల్ హీరోయిన్గా నటిస్తోండగా సునీల్ కీలక పాత్రను చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ ఇస్తుండగా ఇంకా ఫిలోమిన్ రాజ్ ఎడిటర్గా అలాగే విజయ్ మిల్టన్ సినిమాటోగ్రాఫర్గా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: