స్వాతిముత్యం సినిమా ద్వారా వెండి తెరకు పరిచయం అయినటువంటి బెల్లంకొండ గణేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పోయిన సంవత్సరం దసరా పండుగ సందర్భంగా విడుదల అయినటువంటి స్వాతిముత్యం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లో గణేష్ కూడా తన డీసెంట్ నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని ఆ తర్వాత "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. 

ఇలా స్వాతిముత్యం సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న ఈ యువ నటుడు తాజాగా నేను స్టూడెంట్ సర్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని జూన్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. నందిని సతీష్ వర్మ నిర్మించిన ఈ మూవీ కి రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గరపడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి ఈ చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది.

వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమా బృందం ఈ మూవీ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే స్వాతిముత్యం మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ యువ నటుడు నేను స్టూడెంట్ సర్ మూవీ తో ఎలాంటి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో తెలియాలి అంటే జూన్ 2 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: