టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ఈమధ్య వరుస ప్లాపులతో సతమతమవుతున్న విషయం అందరికీ తెలిసిందే. రీసెంట్ గా భారీ అంచనాలతో విడుదలైన 'కస్టడీ' మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ ని మూట గట్టుకుంది. ఇక ఈ సినిమా రిజల్ట్ తో చైతు బాగా డిసప్పాయింట్ అయ్యాడు. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైంది. రెండు భాషల్లోనూ ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడం గమనార్హం.నాగ చైతన్యసినిమా కోసం బాగానే కష్టపడ్డాడు. కానీ కష్టడి మూవీ చైతుకి తీవ్ర నిరాశనే మిగిలింది. ఇక కష్టడి కంటే ముందు వచ్చిన 'థాంక్యూ' మూవీ కూడా డిజాస్టర్ గా నిలవడంతో చైతు ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫై దృష్టి పెట్టినట్లు సమాచారం. 

ఈమేరకు నాగచైతన్య నటించబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. చైతు నెక్స్ట్ మూవీ ని గీతా ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేయబోతున్నారట. గతంలో ఇదే గీతా ఆర్ట్స్ బ్యానర్లో నాగచైతన్య '100% లవ్' అనే సినిమా చేశాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు మళ్లీ గీతా ఆర్ట్స్ తో పనిచేయలేదు చైతు.ఇక తాజాగా తన తదుపరి చిత్రాన్ని గీతా ఆర్ట్స్ వాళ్ళతోనే చేస్తున్నాడట. ఇక ఈ సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది.

చందు ముండేటి ఇటీవల 'కార్తికేయ 2' తో సంచలన విజయాన్ని అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ దర్శకుడు తన నెక్స్ట్ మూవీ ని నాగచైతన్యతో చేయబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో చందముండేటి - నాగచైతన్య కాంబినేషన్లో 'ప్రేమమ్' అనే సినిమా సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. మలయాళం లో హిట్ అయిన ప్రేమమ్ మూవీ ని తెలుగులో రీమేక్ చేశారు. నాగచైతన్య, శృతిహాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్ కలయిక లో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ప్రేమమ్ వంటి హిట్ తర్వాత మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా తెరకెక్కబోతుండటంతో ఈ ప్రాజెక్టు పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: