ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న ముద్దుగుమ్మ లలో శ్రీ లీల ఒకరు. ఈనటి పెళ్లి సందD మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ యావరేజ్ విజయాన్ని అందుకున్నప్పటికీ ఈ సినిమాలో ఈ ముద్దు గుమ్మ నటనకు మాత్రం ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఆ తర్వాత శ్రీ లీల ... మాస్ మహారాజ రవితేజ హీరోగా రూపొందిన ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటించింది.

మూవీ మంచి విజయం సాధించడం అలాగే ఈ సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ప్రస్తుతం శ్రీ లీల కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరస అవకాశాలు దక్కుతున్నాయి. దానితో ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ చేతిలో మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ ,  రామ్ పోతినేని , నితిన్ , పంజా వైష్ణవ్ తేజ్ లాంటి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో భారీ క్రేజ్ ఉన్న హీరోల సరసన హీరోయిన్ గా నటిస్తుంది. వీటితో పాటు మరికొన్ని సినిమాలు కూడా ఈ ముద్దు గుమ్మ చేతిలో ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈనటి తన రెమ్యూనరేషన్ ని ఒక కొత్త రకం పద్ధతిలో తీసుకుంటుందట. చాలా వరకు హీరోయిన్ లు ఒక సమయంలో నటిస్తున్న అన్ని సినిమాలకు దాదాపు ఓకే రెమ్యూనరేషన్ తీసుకుంటారు.

సినిమాలకు ఎన్ని రోజుల సమయాన్ని కేటాయించిన సినిమాకు ఇంత అని తీసుకుంటారు. కాకపోతే శ్రీ లీల మాత్రం 20 రోజుల కంటే ఒక సినిమాకు ఎక్కువ డేట్ లను కేటాయించినట్లు అయితే ఒక రకం రెమ్యూనరేషన్ ను ... 20 రోజుల కంటే తక్కువ డేట్ లను కేటాయించినట్లు అయితే రోజు వారి రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: