తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. వర్షం సినిమా తో మంచి పాపులారిటీ సంపాదించిన త్రిష ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఇక కోలీవుడ్లో కూడా స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది ఈ ముద్దుగుమ్మ. సీనియర్ హీరోయిన్ అయినప్పటికీ కూడా ఇప్పటికి వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. గతంలో సినిమా అవకాశాలు లేక వివాహం చేసుకొని సెటిల్ అవ్వాలనుకున్న త్రిష కొన్ని కారణాల చేత ఆ వివాహాన్ని రద్దు చేసుకుంది.


అయితే ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టి మంచి విజయాలను అందుకుంటోంది .డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించి అద్భుతమైన నటనను ప్రదర్శించింది ఇప్పటికీ యంగ్ హీరోయిన్ గా అదే అందాన్ని ఫిట్నెస్ ని మెయింటైన్ చేస్తూ పలు సినిమాలలో అవకాశాలను అందుకుంటోంది.  త్రిష పలు చిత్రాల తో పాటు వెబ్ సిరీస్లలో నటిస్తూ లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోంది. అయితే ఇటీవలే త్రిష గురించి తమిళ మీడియాలో ఒక వార్త వినిపిస్తోంది అదేమిటంటే బృందా వెబ్ సిరీస్ ను విడిచిపెట్టి అగ్రిమెంటు రూల్స్ ను దిక్కరించడంతో త్రిషపై సోని లైవ్ వారు తమిళ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.


ఈ విషయం తెలిసిన అభిమానులు కాస్త నిరుత్సాహ పడుతున్నారు. ఇటీవల విజయ్ దళపతి తో లియో చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది త్రిష. ఇక ఇదే కాకుండా కోలీవుడ్లో పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది.ఇక అభిమానులు కూడా త్రిష వివాహం కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు మరి ఏడాదైనా త్రిష వివాహ విషయాన్ని తెలియజేస్తుందేమో చూడాలి మరి

మరింత సమాచారం తెలుసుకోండి: