తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆరు సీజన్ లు, ఒకటి ఓటిటి సీజన్ ను కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుందని చెప్పాలి. మొదట్లో ఎన్టీఆర్ తన యాంకరింగ్ తో సీజన్ ను మొదలు పెట్టగా సూపర్ హిట్ చేసి రికార్డు సృష్టించారు. ఆ తర్వాత నాని కూడా యాంకరింగ్ చేశారు. కానీ ఎన్టీఆర్ రేంజ్ లో మెప్పించలేకపోయారు. అయినా సరే తనదైన శైలిలో రెండవ సీజన్ తో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు.

ఇకపోతే సీజన్ 3 నుంచి 6 వరకు వరుసగా నాలుగు సీజన్లకు హోస్ట్ గా నాగార్జున వ్యవహరించిన విషయం తెలిసిందే.. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన నాలుగో సీజన్ కు భారీ రెస్పాన్స్ లభించింది.  అయితే సీజన్ సిక్స్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు పైగా అన్యాయం మోసం జరిగిందని ప్రేక్షకులు కూడా ఫీలవుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా బిగ్ బాస్ ఏడవ సీజన్ కి సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ బయటకు రావడం జరిగింది.

ఆరవ సీజన్ మొత్తం పేలవంగా సాగిన నేపథ్యంలో సీజన్ సెవెన్ ను సరికొత్తగా ప్లాన్ చేస్తూ డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా బిగ్ బాస్ కు లీకులు అనేది పెద్ద బెడదగా మారిపోయింది . ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు? కెప్టెన్ ఎవరు? అనే విషయాలను ముందుగానే ప్రేక్షకులు కనిపెట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి భారీగా ఏర్పాట్లు చేయాలి అని.. లీకుల బెడద నుంచి తప్పించాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. మరి ముఖ్యంగా కాంట్రవర్షల్ క్యాండిడేట్లను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఇక హోస్ట్ విషయానికి వస్తే నాన్ స్టాప్ సీజన్లో కనిపించిన మిత్రాశర్మ ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి పోస్టుగా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది మరి ఆయన ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: