బిచ్చగాడు మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ తాజాగా బిచ్చగాడు 2 అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. బిచ్చగాడు మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో బిచ్చగాడు 2 మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ ని తెలుగు లో కూడా కొన్ని రోజుల క్రితమే విడుదల చేశారు. ఈ మూవీ లో విజయ్ ఆంటోనీ హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. ఈ సినిమాలో విజయ్ ఆంటోని సరసన కావ్య తప్పర్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటి వరకు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 16 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా 16 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసిందో తెలుసుకుందాం.

మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.32 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా , 2 వ రోజు 1.62 కోట్లు , 3 వ రోజు 1.88 కోట్లు , 4 వ రోజు 65 లక్షలు , 5 వ రోజు 46 లక్షలు , ఆరవ రోజు 32 లక్షలు , ఏడవ రోజు 20 లక్షలు , 8 వ రోజు 15 లక్షలు , 9 వ రోజు 25 లక్షలు , పదవ రోజు 40 లక్షలు , 11 వ రోజు 21 లక్షలు , 12 వ రోజు 20 లక్షలు , 13 వ రోజు 16 లక్షలు , 14 వ రోజు 11 లక్షలు , 15 వ రోజు 8 లక్షలు , 16 రోజుల 12 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా 16 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.13 కోట్ల షేర్ కలక్షన్ లను 16.43 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇప్పటికి కూడా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ కలెక్షన్ లు లభిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: