టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ నటుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఈ సంవత్సరం వినరో భాగ్యము విష్ణు కథ , మీటర్ అనే రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో ఈ సంవత్సరం మొదటగా విడుదల అయినటువంటి వినరో భాగ్యము విష్ణు కథ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రూపొంది ప్రేక్షకులను భాగానే ఆకట్టుకుంది. ఈ మూవీ కి మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వం వహించాడు.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను బాగానే కట్టుకొని మంచి కలెక్షన్ లను వసూలు చేసి హిట్ సినిమాగా నిలిచింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితం నుండి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ కి "ఓ టి టి"  ప్రేక్షకుల నుండి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర  "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకులను బాగా అలరించిన ఈ సినిమా ఇప్పటి వరకు బుల్లి తెరపై ప్రసారం కాలేదు. ఇది ఇలా ఉంటే ఇన్ని రోజుల పాటు ఈ సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ ను ఈ మూవీ మేకర్స్ ఏ సాటిలైట్ సంస్థకు అమ్మ నట్లుగా తెలుస్తుంది.

తాజాగా ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను ఈ మూవీ మేకర్స్ స్టార్ మా సంస్థ కు అమ్మినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మరి కొన్ని రోజుల్లోనే ఈ సినిమాను స్టార్ మా సంస్థ తమ టెలివిజన్ ఛానల్లో ప్రసారం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే వినరో భాగ్యము విష్ణు కథ మూవీ తర్వాత కిరణ్ నటించిన మీటర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: