సమంత ప్రస్తుతం టర్కీ లోని ఇస్తాంబుల్ లో ‘ఖుషీ’ షూటింగ్ లో చాల ఉత్సాహంగా పాల్గొంటోంది. విజయ్ దేవరకొండ తో కలిసి ఆమె రకరకాల హోటల్స్ కు పబ్ లకు వెళుతూ అక్కడి ఫోటోలను తన అభిమానులకు షేర్ చేస్తోంది. దీనితో సమంత తన అనారోగ్య సమస్యల నుండి అదేవిధంగా ‘శాకుంతలం’ ఫ్లాప్ షాక్ నుండి తేరుకుని బయటపడిందని ఆమె అభిమానులు ఆనంద పడుతున్నారు.

 

 

ఈపరిస్థితుల మధ్య ఆమె ఆన్ లైన్ లో ఆడిషన్స్ ఇస్తూ బిజీగా ఉంది అన్న వార్తలు కూడ వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె లండన్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమయంలోనే ఆమెకు అనేక హాలీవుడ్ ఫిలిం మేకింగ్ కంపెనీ ప్రతినిధులతో పరిచయాలు ఏర్పడ్డాయి.

 

 

ఇప్పుడు ఆ పరిచయాలు ఆమెకు హాలీవుడ్ మూవీలో కొన్ని అవకాశాలు తెచ్చి ఇచ్చే ఆస్కారం ఉంది అన్నప్రచారం జరుగుతోంది. సాధారణంగా హాలీవుడ్ మూవీ మేకింగ్ సంస్థలు తాము తీయబోయే సినిమాలు వెబ్ సిరీస్ లకు సంబంధించి ఎంత పేరున్న నటీనటులకైన ఆడిషన్స్ నిర్వహిస్తాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి సమంతకు కూడ ఎదురవ్వడంతో ఆమె టర్కీలో ఒకవైపు ‘ఖుషీ’ షూటింగ్ లో పాల్గొంటూ మరొకవైపు ఆడిషన్స్ ఆన్ లైన్ లో ఇస్తూ చాల బిజీగా ఉందని వార్తలు వస్తున్నాయి.

 

 

ఈ ఆడిషన్స్ సక్సస్ అయితే ఏదోఒక హాలీవుడ్ బడా ప్రాజెక్ట్ లో సమంత భాగం అయితే ఆమె కెరియర్ ఎవరు ఊహించని మలుపు తిరుగుతుంది. ప్రస్తుతం సమంత వయసు 36 సంవాత్సరాలు వాస్తవానికి ఆమె నాగచైతన్య తో పెళ్ళి అవ్వక ముందు తాను 35 సంవత్సరాలకు సినిమాల నుంచి రిటైర్ అవుతాను అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే ఇప్పుడు అనేక ఊహించని మలుపులు ఆమె జీవితంలో రావడంతో మరొక నాలుగు సంవత్సరాలు ఆమె కెరియర్ సినిమాలలో కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది..

 


మరింత సమాచారం తెలుసుకోండి: