
బాలీవుడ్ లో ఆలియా భట్ చేసిన సినిమా లకు ఆర్.ఆర్.ఆర్ సినిమా లో ఆమె పాత్రకు ఏమాత్రం పొంతన లేదు అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు. అలాంటి అసంతృప్తిని ఆమెకు కలిగించింది. ఆమెను అసంతృప్తి నుండి బయట పడేసేందుకు గాను రాజమౌళి ఆమె నటించిన బ్రహ్మాస్త్ర సినిమాను తెలుగు లో విడుదల చేయడం జరిగింది.
అందుకే బాలీవుడ్ లో ఆమె ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తోంది. కానీ ఇప్పటి వరకు సౌత్ లో కానీ ఇతర భాషల సినిమా ల్లో కానీ ఆలియా భట్ నటించేందుకు ఆసక్తి చూపించడం లేదు. తెలుగు లో ఈమె నటించేందుకు మరో అయిదు సంవత్సరాలు ఆగాలేమో అంటూ కొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ యొక్క చేదు అనుభవం మొత్తం పోవాలి అంటే వెంటనే సాధ్యం కాదు. కనుక వెంటనే ఆమె తెలుగు లో నటించేందుకు ఆసక్తి చూపించక పోవచ్చు అంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుగుతున్న ఆలియా భట్ మరోసారి తెలుగు లో నటించి తనను తాను తగ్గించుకోవద్దని భావిస్తుంది అంటూ బాలీవుడ్ మీడియా లో కథనాలు వస్తున్నాయి. ముందు ముందు అయినా సౌత్ లో ఆలియా నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. వారి కోరిక తీరేనా చూడాలి.