స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. అల్లు అర్జున్ , డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఎన్నో చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. అయితే ముఖ్యంగా ఈ సినిమాలు మొదట నెగిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా భారీ గాని సంపాదించాయి. అల్లు అర్జున్ ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప-2 సినిమాలో నటిస్తూ ఉన్నారు .త్రివిక్రమ్ మాత్రం మహేష్ తో కలిసి గుంటూరు కారం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఈ సినిమాలు పూర్తి చేసిన వెంటనే వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.


అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురం వంటి చిత్రాలు విడుదలయ్యాయి. ఈ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు తాజాగా నాలుగవ సినిమా నీ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇంకా అధికారికంగా ఎవరు తెలుపకపోయిన ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.. త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమా అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా అయిపోయిన వెంటనే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే అల్లు అర్జున్ కు ఒక లైన్ వినిపించినట్లుగా సమాచారం ఈ లైన్ విన్న అల్లు అర్జున్ కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా అల్లు అర్జున్ 22వ సినిమాగా ప్రకటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి మరి ఏ మేరకు ఈ సినిమా విషయంపై అధికారికంగా స్పందిస్తారు చూడాలి మరి. ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెలుబడునున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: