ఇప్పుడు ఆగష్టులో ‘భోళాశంకర్’ రాబోతోంది. అయితే ఈమూవీ పై పెద్దగా అంచనాలు లేకపోవడం ఒక విధంగా చిరంజీవికి మళ్ళీ షాక్ ఇచ్చే విషయం. దీనికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. చాలా సంవత్సరాల క్రితం వచ్చిన తమిళ సినిమాకు ఈమూవీ రీమేక్ కావడం ఒక కారణం అయితే ఈమూవీ తెలుగు డబ్బింగ్ ను ఇప్పటికే అనేకమంది చూసిన సందర్భం ఉంది.
దీనికితోడు గతంలో ‘శక్తి’ ‘షాడో’ లాంటి భయంకరమైన ఫ్లాప్ సినిమాలు తీసిన మెహర్ రమేష్ ఈమూవీకి దర్శకత్వం వహించడం మరొక కారణంగా కనిపిస్తోంది. మెహర్ రమేష్ కు చిరంజీవికి ఉన్న సాన్నిహిత్యం రీత్యా అతడికి ఈ అవకాశం వచ్చింది అన్న ప్రచారం కూడ ఉంది. కరోనా సమయంలో చిరంజీవి చేపట్టిన సేవా కార్యక్రమాలను మెహర్ రమేష్ దగ్గర ఉండి అన్నీ పర్యవేక్షించడంతో చిరంజీవి మెహర్ రమేష్ కు ఈ అవకాశం ఇచ్చాడు అన్న మాటలు కూడ ఉన్నాయి.
లేటెస్ట్ గా విడుదలైన ఈసినిమా టీజర్ ను చూసిన తరువాత చాలామంది ఈసినిమా పై ఆశలు వదులుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమూవీ టీజర్ ఇలా ఉంటే రాబోయే సినిమా ఇక ఎలా ఉంటుందో అంటూ మెగా అభిమానులు కూడ భయపడుతున్నట్లు టాక్. దీనికితోడు ఈమూవీలో చిరంజీవి లుక్ బాడీ లాంగ్వేజ్ ఏమాత్రం బాగా లేకపోవడంతో పాటు చిరంజీవి నోటివెంట వచ్చిన తెలంగాణ యాస డైలాగ్స్ అంతగా బాగలేవు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో చిరంజీవి అభిమానులకు మెహర్ రమేష్ ‘ఆచార్య’ షాక్ ను గుర్తు చేయబోతున్నాడ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి