రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు విభిన్నమైన పాత్రలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆది పురుష్ సినిమాలో రాముడి క్యారెక్టర్ తో ప్రేక్షకులను అలరించిన ఈయన ప్రస్తుతం ఆయన నటిస్తున్న మరో భారీ ప్రాజెక్టు సినిమా ప్రాజెక్టు కే.. ఈ సినిమా షూటింగు ఇప్పటికే శరవేగంగా జరుపుకుంటుంది. దాదాపు 80 శాతానికి పైగా ఈ సినిమా షూటింగు పూర్తయినట్లు సమాచారం. డైరెక్టర్ నాగార్జున దర్శకత్వంలో పాన్ వరల్డ్ చిత్రంగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్ కూడా కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన పాత్రకు సంబంధించిన విషయాన్ని కూడా అధికారికంగా వెల్లడించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా వచ్చే ఏడాది సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త నెట్టింట చాలా వైరల్ గా మారుతుంది. అదేమిటంటే ఇది సైన్స్ ఫిక్షన్, సూపర్ నాచురల్ యాక్షన్ చిత్రం అని.. మార్వెల్ సినిమాల మాదిరిగానే గుడ్ వర్సెస్ ఈవిల్ తరహాలో ఉంటుందని సమాచారం.

భారతీయ ఇతిహాసం మహాభారతం స్ఫూర్తితో మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా వస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ప్రభాస్ కర్ణుడిని పోలిన పాత్రలో కనిపించనున్నారు అని.. అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామ పాత్రను పోలిన పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఇక కర్ణుడి పాత్రలో ప్రభాస్ ఎలా నటించబోతారు అన్న విషయం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా ఇతిహాస పురాణ పాత్రలను చేస్తూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు ప్రభాస్.

మరింత సమాచారం తెలుసుకోండి: