బిగ్బాస్ ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకున్న ప్రముఖ సీరియల్ యాక్టర్ కీర్తి భట్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మనసిచ్చి చూడు అనే సీరియల్ లో భానుగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన ఈమె కార్తీకదీపం సీరియల్ లో పెద్దదైన హిమ పాత్రలో నటించి అందరిని ఆకట్టుకుంది. అప్పటివరకు సీరియల్స్ చూసే వారికి మాత్రమే పరిచయమైన ఈమె ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి తన రియల్ లైఫ్ గురించి చెప్పిందో ఇక అప్పటి నుంచే కీర్తిని అందరూ తమ ఇంట్లో బిడ్డ లాగా భావిస్తున్నారు. అటు స్మాల్ స్క్రీన్ నుంచి ఇటు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా కీర్తిని ఎవరికి వారు ఓన్ చేసుకుంటూ ఉండడం గమనార్హం.


అయిన వాళ్లందర్నీ కోల్పోయి ఒంటరిగా మిగిలిన కీర్తి పెళ్లికి ముందే ఒక పాపని దత్తత తీసుకున్నా కూడా ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలువలేదు. బిగ్ బాస్ కి వెళ్లే కొద్ది రోజుల ముందు ఆ పాప కూడా మరణించింది. ఇక ఒక అమ్మాయి తల్లిగా మారడం కన్నా అద్భుతమైన క్షణం , అదృష్టం ఇంకొకటి లేదు అని చెప్పి ఎమోషనల్ అయిన కీర్తి ఆ అదృష్టం తనకు లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తన ఫ్యామిలీతో ప్రయాణిస్తున్నప్పుడు కార్ యాక్సిడెంట్ జరగకా.. తనకు కూడా ఇక తల్లి అయ్యే అదృష్టం లేదని వెల్లడించి అందరి చేత కన్నీటిని పెట్టించింది. ఇలాంటి కీర్తిని అర్థం చేసుకొని ఇప్పుడు ఒక వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చారు.

ఇందులో భాగంగానే మాటీవీలో మా బోనాల జాతర ప్రోగ్రాంలో భాగంగా నటుడు విజయ్ కార్తీక్ తో ఎంగేజ్మెంట్ చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచిన కీర్తి.. అదే వేదికపై అత్తమామలను కూడా పరిచయం చేసింది. అదే సమయంలో కీర్తిని తమ కుటుంబంలోకి కూతుర్ల ఆహ్వానిస్తున్నామని చెప్పి భావోద్వేగానికి గురైంది ఆమె అత్త. ఇకపోతే కీర్తి కాబోయే భర్త చిత్తూరు జిల్లా మదనపల్లిలో పెరిగి బెంగళూరులో చదివాడు. కన్నడ నాట కొరియోగ్రాఫర్ గా కెరియర్ ప్రారంభించి.. 2014లో సేడు అనే సినిమాలో హీరోగా నటించాడు. ఆ తర్వాత ఏబీ పాజిటివ్, చెడ్డి గ్యాంగ్, ఓ వెబ్సిరీ వంటి సినిమాలలో నటించారు. తమిళంలో కూడా డార్క్ నైట్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇకపోతే ఈ జంట కలకాలం సంతోషంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: