జబర్దస్త్ లో మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో ముక్కు అవినాష్ కూడా ఒకరు. గతంలో జబర్దస్త్ లో ప్రసారమయ్యేటువంటి ఎన్నో స్కిట్ల ద్వారా ప్రేక్షకులను మెప్పించిన అవినాష్ తన కామెడీతో సెటైర్లు వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేవారు. ముక్కు అవినాష్ ఒకవైపు సినిమాలలో మరొకవైపు బుల్లితెరపై పలు షోలలో కామెడీ చేస్తూ బాగా అలరించారు. ఇదంతా ఇలా ఉంటే ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ లో కూడా కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన అవినాష్ ఆ షోలో కూడ బాగానే సందడి చేయడం జరిగింది. ముఖ్యంగా యాంకర్ అరియాన తో పరిచయం ఏర్పడగా ఆ పరిచయం ప్రేమ వరకు వెళ్లిందని వార్తలు వినిపించాయి. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు అనే వార్తలు కూడా వినిపించాయి.


కానీ అనూహ్యంగా అవినాష్- అనూజ అనే అమ్మాయిని వివాహం చేసుకోవడం జరిగింది.వివాహమయ్యాక  అనూజ తో కలసి స్టార్ మాలో ప్రసారమయ్యేటువంటి కొన్ని షోలలో పాల్గొనడం జరిగింది ముక్కు అవినాష్.. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ జంట ఒక గుడ్ న్యూస్ తెలియజేయడం జరిగింది తమ సోషల్ మీడియా వేదికగా అనూజ,అవినాష్ త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నామని విషయాన్ని తెలియజేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చాలా ఆనందంగా ఈ విషయం తెలియజేయడం మాకు ఆనందాన్ని కలిగిస్తుంది అంటూ తెలియజేస్తున్నారు ఈ జంట.


ప్రస్తుతం ఈమెకు నాలుగో నెల అని వైద్యులు మూడో నెల వరకు ఎవరికీ చెప్పవద్దని తెలియజేసినట్లు తెలియజేశారు. మేము తల్లిదండ్రులు అవుతున్నామనే విషయాన్ని మా కంటే ఎక్కువగా మా తల్లితండ్రులు అత్తమామలకి ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తోంది అంటూ ఒక వీడియో ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు , బుల్లితెర సెలబ్రెటీలు సైతం అవినాష్ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: