కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి తాజాగా డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వం లో లియో సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్లో తెరకెక్కించడం జరుగుతోంది. మాస్టర్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అభిమానులు కూడా ఈ సినిమా పైన చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా ముగించుకున్నట్టు తెలుస్తోంది. విజయ్ కూడా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసినట్లు సమాచారం. ఈ చిత్రం పైన టాలెంటెడ్ యాక్టర్ అర్జున్ దాస్ పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేయడం జరిగింది. వాటి గురించి తెలుసుకుందాం.

అర్జున్ దాస్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా డిస్కషన్ జరిగింది. ఇందులో తను కూడా నటిస్తున్నానని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమా కథ తనకి ముందే తెలుసని ఈ సినిమాలో నటించేవారు వారి రోల్స్ కూడా తెలుసని.. ఈ సినిమా పైన అభిమానులు చూపిస్తున్న ప్రేమ ఇన్క్రెడిబుల్ అని తెలియజేశారు. అక్టోబర్ 19న థియేటర్లు బద్దలవ్వడం ఖాయం అంటూ కూడా తెలియజేశారు .తన రోల్ ఎలా ఉంటుంది అనే విషయంపై చాలా సస్పెన్స్ లో పెట్టడం జరిగింది అర్జున్ దాస్.


ఈ చిత్రంలో హీరోయిన్ త్రిష కూడా నటిస్తోంది. అలాగే సంజయ్ దత్.. గౌతమ్ మీనన్ అర్జున్ సర్జ ప్రియా ఆనంద్ తదితరులు సైతం కీలకమైన పాత్రలు నటిస్తూ ఉన్నారు ఈ చిత్రానికి ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తూ ఉన్నారు. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పనిచేస్తూ ఉన్నారు. ఈ సినిమా తమిళంతోపాటు ఇతర భాషలలో సైతం అక్టోబర్ 19న విడుదల చేసే విధంగా చిత్ర బృందం సన్నహాలు చేస్తున్నారు. మరి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా దసరాబరిలో దిగుతున్నట్లు తెలుస్తోంది. మరి ఏ మేరకు అభిమానులను మెప్పిస్తుందో ఈ సినిమా చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: