టాలీవుడ్ యువ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా సాయి రాజేష్ దర్శకత్వంలో బేబీ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఈ నెల 14 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా ఇప్పటి వరకు నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ నాలుగు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రోజు వారిగా ఏ రేంజ్ కలెక్షన్ లను రాబట్టింది అనే విషయాలను తెలుసుకుందాం.
ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 3.48 కోట్ల షేర్ ... 6.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 2 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 3.56 కోట్ల షేర్ ... 6.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 4.39 కోట్ల షేర్ ... 7.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఈ మూవీ కి 4 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 4.08 కోట్ల షేర్ ... 7.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
మొత్తంగా ఈ సినిమాకు 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 15.41 కోట్ల షేర్ ... 28.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఇకపోతే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 7.40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 8 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరి లోకి దిగింది. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని 7.41 కోట్ల లాభాలను అందుకుంది.
ఇకపోతే ఈ మూవీ కి సూపర్ సాలిడ్ బ్లాక్ బాస్టర్ టాక్ రావడంతో ప్రస్తుతం కూడా ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు ఈ మూవీ కి దక్కుతున్నాయి.