దీనికితోడు ఈమూవీ పై మితిమీరిన అంచనాలు పెరిగిపోకుండా ఈ మూవీ నిర్మాతలు చాలా లో ప్రొఫైల్ ప్రమోషన్ చేస్తున్నారు. పవన్ అభిమానులు అసంతృప్తిగా ఉన్నప్పటికీ ఈమూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ గురించి ఇంకా ఎటువంటి ప్రకటన లేకపోవడం పవన్ అభిమానులకు మరింత టెన్షన్ పెడుతున్నట్లు టాక్.
తమిళ సినిమా ‘వినోదయ సితం’ కు రీమేక్ గా సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతున్న ఈమూవీకి మ్యూజిక్ పరంగా తమన్ ఇచ్చిన పాటలకు కూడా నెగటివ్ ఫీడ్ బ్యాకే తెచ్చుకోవడం కూడ పవన్ కళ్యాణ్ అభిమానులను నిరాశ పరుస్తోంది అని టాక్. ఈ సినిమాకు సంబంధించి బెనిఫిట్ షోలు టిక్కెట్ల రేట్లు పెంపులాంటిటివి ఉండవని నిర్మాతల నుండి లీకులు వస్తున్న నేపధ్యంలో ఈనిమాకు సంబంధించి ఇలా ఎందుకు జరుగుతోంది అంటూ పవర్ స్టార్ అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు.
వాస్తవానికి ‘బ్రో’ రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్ మూవీ కాదు. ఈమూవీలో పవన్ పక్కన హీరోయిన్ కూడ ఉండదు ఫైట్స్ కూడ ఉండవు. కేవలం పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ లపై ఒక పబ్ సాంగ్ మాత్రమే ఉంటుంది. ఈమూవీకి ఎటువంటి పోటీ లేదు కాబట్టి ఓపెనింగ్ కలక్షన్స్ విషయంలో ఎటువంటి సమస్య ఉండదు. ప్రస్తుతం పవన్ ఆంధ్రప్రదేశ్ లో అక్కడి అధికార పార్టీతో ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ తో చేస్తున్న రాజకీయ పోరాటంతో పవన్ కు చాలామంది శత్రువులు ఏర్పడుతున్నారు. ఈ శత్రువులు వల్ల ‘బ్రో’ కు కలక్షన్స్ పరంగా ఏమైనా సమస్యలు వస్తాయా అన్న సందేహాలు కూడ కొందరిలో ఉన్నట్లు మాటలు వినిపిస్తున్నాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి