ఇందులో ఒక ముఖ్యమైన పాత్రలో అక్కినేని నాగార్జున కూడా నటించబోతున్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమా మల్టీస్టారర్ మూవీ అయితే కాదని తెలుస్తోంది.. కానీ ఈ పోస్టర్లో చూపించిన ప్రకారం ఇందులో ఒక ఖరీదైన భవనాలను చూపిస్తూ మరొకవైపు పేదరికాన్ని ప్రతిబింబించేలా మురికివాడని చూపిస్తూ ఈ రెండిటికి మధ్యలో పాత 100 రూపాయల నోట్ల కట్టను వహించడం జరిగింది.. దీన్ని బట్టి చూస్తే శేఖర్ కమ్ముల గతంలో తెరకెక్కించిన లీడర్ సినిమాకి సీక్వెల్స్ తీస్తున్నారు అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
కానీ వినిపిస్తున్న సమాచారం ప్రకారం ధనుష్తో పాన్ ఇండియా ఫిలిం ని తీరక ఎక్కిస్తున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా సోషియో పొలిటికల్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా వైడుగా రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ సినిమా కనెక్ట్ అయితే కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం జరుగుతుందని అభిమానులు సైతం భావిస్తూ ఉన్నారు.. ఇప్పటివరకు శేఖర్ కమ్ముల తన చిత్రాలు కూడా చాలా విభిన్న మైనంగానే తెరకెక్కించడం జరిగింది. ధనుష్ 51వ ప్రయత్నంతో ఏ మేరకు అభిమానులను మెప్పిస్తారో చూడాలి మరి. మరి ఈ సినిమా పైన చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి