ప్రస్తుతం డైరెక్టర్ నాగ్ అశ్విన్ వీటన్నిటి పైన ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఎలాంటి ట్రోల్స్ వచ్చాయి నెక్స్ట్ టైం అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు ఏం చేస్తే మంచిదని ఆలోచనలు ఆలోచిస్తున్నట్లుగా సమాచారం.. దీంతో ఇప్పుడిప్పుడే ఈ సినిమా నుంచి మళ్లీ అప్డేట్ అవకాశమైతే కనిపించలేదని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. ఎందుకంటే ప్రభాస్ సలార్ చిత్రంలో కూడా నటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యే దిశలో అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రశాంత నీల్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కించడం జరిగింది.
కల్కి సినిమా కొత్త అప్డేట్ అయితే రాలేదు కేవలం టీజర్ రిలీజ్ చేశారు.. కాబట్టి నెక్స్ట్ వచ్చేది ట్రైలర్ ఫుల్ ఫోకస్ మొత్తం ట్రైలర్ మీద పెట్టినట్లుగా తెలుస్తోంది చిత్రబృందం. ట్రైలర్ లోపు ఏవైనా పొరపాట్లు ఉన్నాయా లేవా అని చెక్ చేసుకొని ట్రైలర్ విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్.. మొదటి భాగం వచ్చే ఏడాది మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. నిర్మాత అశ్వని దత్ కు ఆరోజు చాలా స్పెషల్ రోజుట.ఎందుకంటే నిర్మాణరంగం మొదలుపెట్టిన రోజు కూడా అదేనట.అందుకే తన చిత్రాలన్నీ ఎక్కువగా ఆ రోజునే విడుదల చేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి