సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆయనకు ఉన్న స్టార్ స్టామినా గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకోవడం మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఆగస్టు 9 వ తేదీన మహేష్ పుట్టిన రోజు అన్న విషయం మన అందరికీ తెలిసిందే. దానితో ఈ సంవత్సరం ఆగస్టు 9 వ తేదీన మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ లను మూవీ బృందం విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆయన కెరియర్ లో అద్భుతమైన విజయం సాధించినటువంటి ఒక సినిమాను కూడా ఆగస్టు 9 వ తేదీన థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఆ విషయాలు ఏమిటో తెలుసుకుందాం.

మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి ... శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సంవత్సరం మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ మేకర్స్ ఒక అదిరిపోయే సాంగ్ ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే తమన్ ఒక సాంగ్ ను కూడా రెడీ చేసినట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే మహేష్ కెరియర్.లో అద్భుతమైన విజయం సాధించిన సినిమాలలో "బిజినెస్ మాన్" మూవీ ఒకటి. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ ... మహేష్ సరసన హీరోయిన్ గా నటించగా ... పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ మూవీ ని ఈ సంవత్సరం మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆగస్టు 9 వ తేదీన 4 కే వర్షన్ తో థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: