కానీ ఇప్పుడు కాలంతో పాటుగానే సెలబ్రిటీల తీరు కూడా మారిపోయింది. ఒకప్పటిలా పర్సనల్ విషయాలను లేదా ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాలను బయటకు చెప్పడానికి సంకోచించడం లేదు సెలబ్రిటీలు. ఈ క్రమంలోనే ఇక ఎంతోమంది సెలబ్రిటీలు ఇప్పటికే తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి సోషల్ మీడియా వేదికగా చెప్పి షాక్ ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక మరి కొంతమంది తమకు బాడీ షేమింగ్ ఆరోపణలు కూడా ఎదురయ్యాయి అంటూ చెప్పుకొచ్చారు.
ఇక ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ సయామీ కేర్స్ సైతం తనకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి అంటూ చెబుతోంది. ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తలో తన ముక్కు పెదాలు సరిగ్గా లేవని సర్జరీ చేయించుకుని సరి చేసుకోవాలని అనేకమంది తప్పుడు సలహాలు ఇచ్చారు అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇలాంటి వాటిని నేను పట్టించుకోలేదని చెప్పుకొచ్చింది. కాగా అభిషేక్ బచ్చన్ తో కలిసి నటించిన గూమర్ సినిమా ప్రమోషన్లలో ఈ వ్యాఖ్యలు చేసింది. మనం ఎలా ఉన్నామో అలాగే ప్రేక్షకులను మెప్పించాలి అంటూ అభిప్రాయపడింది. అయితే ఈమె తెలుగులో రేయ్, హైవే, వైల్డ్ డాగ్ సినిమాల్లో నటించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి