ఎలాంటి బ్యాక్ గ్రౌండ్  లేకుండా ఇండస్ట్రీకి  ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు వరకు విజయ్ దేవరకొండ ఎన్నో వివాదాల్లో  ఇరుక్కున్నారు. కాగా ఇటీవల కాలంలో జబర్దస్త్ యాంకర్ అనసూయ కి హీరో విజయ్ దేవరకొండకి మధ్య వివాదం నడుస్తుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఏకంగా లైగర్ ప్లాప్ గురించి అనసూయ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం సంచలనంగా మారింది. ఇక ఖుషి సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదల చేసిన సమయంలో ది విజయ్ దేవరకొండ అని పేరు రావడంతో అతనికి ది అని పెట్టడం ఏంటో అని విమర్శలు చేసింది.


 అయితే అనసూయ, విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ వరుసగా పోస్టులు పెట్టడంతో.. ఇక రౌడీ హీరో ఫ్యాన్స్ ఆమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఇటీవల విమానం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ వివాదానికి ఇక్కడితో ముగింపు పలకాలని అనుకుంటున్నాను అంటూ అనసూయ స్పష్టం చేసింది. అయితే ఇటీవల అనసూయతో మొదలైన వివాదం గురించి అటు విజయ్ దేవరకొండ కూడా స్వయంగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్గా నటించిన ఖుషి సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు.


 ఇక ఈ ట్రైలర్ ఈవెంట్లో భాగంగా మీడియా ప్రతినిధులు విజయ్ దేవరకొండ ను అనసూయతో వివాదం ఏంటి అనే విషయంపై పలు ప్రశ్నలు సంధించారు. అనసూయతో వివాదానికి ఎప్పుడు పుల్ స్టాప్ పడుతుంది అంటూ అడిగారు  అయితే దీనిపై విజయ్ దేవరకొండ ఆసక్తికరసమాధానం ఇచ్చాడు  ఏమో మీరు గొడవ పడే వాళ్ళనే అడగాలి. సోషల్ మీడియాలో ఏం నడుస్తుందో నాకైతే తెలియదు అంటూ విజయ్ దేవరకొండ సింపుల్ గా సమాధానం ఇచ్చాడు. అంటే అనసూయ తనపై ఎన్ని పోస్టులు పెట్టిన తాను మాత్రం పట్టించుకోవట్లేదు అని ఇన్ డైరెక్ట్ గా సమాధానం చెప్పాడు విజయ్ దేవరకొండ.

మరింత సమాచారం తెలుసుకోండి: