టాలీవుడ్ యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ తన కెరీర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో నటించాడు. కాకపోతే ఈ నటుడుకి ఆ సినిమాలు భారీ స్థాయిలో గుర్తింపును తెచ్చి పెట్టలేదు. ఇకపోతే పోయిన సంవత్సరం ఈ నటుడు డిజె టిల్లు అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడం అలాగే ఈ సినిమాలో సిద్దు తన అద్భుతమైన డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో ... డైలాగ్ డెలివరీతో ... డ్రెస్సింగ్ స్టైల్స్ తో కుర్రకారు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దీనితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలక్షన్ లను కూడా రాబట్టింది.

అలాగే ఈ సినిమాతో ఈ నటుడి క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. విమల్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా ... ప్రిన్స్మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఈ సినిమా పోయిన సంవత్సరం ఫిబ్రవరి 12 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే పోయిన సంవత్సరం విడుదల అయ్యి మంచి విజయం సాధించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

ఇకపోతే ఈ సినిమాను ఈ నెల 18 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున రీ రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి. ఇకపోతే ప్రస్తుతం సిద్దు "డీజే టిల్లు" మూవీ కి సీక్వెల్ గా రూపొందుతున్న టిల్లు స్క్వేర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాను అక్టోబర్ 6 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: