పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నిన్నటి రోజున ఆయన చిత్రాలకు సంబంధించి పలు రకాల అప్డేట్లను సైతం చిత్ర బృందాలు విడుదల చేస్తూ అభిమానులను ఫుల్ ఖుషి చేశారు.. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో వస్తున్న OG సినిమా సంబంధించి నిన్నటి రోజున ఒక గ్లింప్స్ సైతం విడుదల చేశారు. ఇది అందరినీ ఆకట్టుకున్నట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా ఎక్కువగా రీమిక్స్ సినిమాలోనే చేస్తూ ఉన్నారు..కానీ ఆయన నుంచి వస్తున్న ఒరిజినల్ మూవీ కావడంతో అభిమానులు ఈ సినిమా పైన మంచి హోప్స్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది.


OG చిత్రానికి గ్లింప్స్  సైతం అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ అందించడం గమనార్హం.. ఆయన వాయిస్ ఓవర్ తోనే మొదలవుతుంది. పదేళ్ల క్రితం బాంబేలో ఒక తుఫాన్ గుర్తుందా అది మట్టి చెత్త తో పాటు సగం ఊరిని మింగేసింది అంటూ చెప్పే డైలాగులతో ఈ గ్లింప్స్ రావడం జరిగింది.. ఇందులో పవన్ కళ్యాణ్ లుక్ పరంగా చాలా స్టైలిష్ గా కొత్తగా కనిపిస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే ఈ సినిమా సీక్వెల్ కూడా ఉండబోతోందని సమాచారం.. అయితే ఈ విషయం మాత్రం ఓజి మొదటి భాగం పైన పైన ఆధారపడి ఉంటుంది అంటు పలు రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి.


ముఖ్యంగా ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో తమిళ్ తెలుగు మరియు హిందీ భాషలలో ఒకేసారి థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిన్న వీడియో వల్ల ఈ సినిమాకి ఇంత హైప్ ను తీసుకురావడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. మరి ఈ సినిమా ఏ విధంగా సక్సెస్ అవుతుందో చూడాలి మరి.. ఇందులో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తూ ఉండగా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. అలాగే అర్జున్ దాస్ ,శ్రీయ రెడ్డి కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: