తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఉంటారు. ఇకపోతే ప్రస్తుతం వీరు నటిస్తున్న సినిమాలకు సంబంధించిన విడుదల తేదీలను ఇప్పటికే మూవీ బృందాలు ప్రకటించాయి. వాటిని ఏ తేదీన విడుదల చేయబోతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి , శ్రీ లీల హీరోయిన్ లుగా నటిస్తూ ఉండగా ... త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. జాన్వీ కపూర్ ఈ మూవీ లో హీరోగా నటిస్తూ ఉండగా ... సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: