తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి టాలెంట్ ఉన్న హీరోలలో నవీన్ పోలిశెట్టి కూడా ఒకరు అని చెప్పాలి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎన్నో కష్టాలు పడుతూ వచ్చిన ఈ హీరో ఇప్పుడు వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఒకప్పుడు చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరియర్లో నిలుదొక్కుకోవడానికి  ప్రయత్నించిన నవీన్ పోలిశెట్టి.. ఇక ఇప్పుడు మాత్రం మంచి విజయాలు సాధిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో.. జాతి రత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులందరికీ ఒక్కసారిగా దగ్గరయ్యాడు.


 మిస్ శెట్టి  మిస్టర్ పొలిశెట్టి అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకులు ముందుకు వచ్చి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి సరసన సీనియర్ హీరోయిన్ అనుష్క నటించింది. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ మంచి కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతుంది. అయితే ఈ యంగ్ హీరో ఫ్లాప్ డైరెక్టర్స్ కి బాగా కలిసొస్తున్నాడు  అని ఒక వార్త వైరల్ గా మారిపోయింది. జాతి రత్నాలు సినిమాకి ముందు అనుదీప్ పిట్టగోడ అనే సినిమా తీశాడు. ఇది పెద్దగా ప్రేక్షకదరణకు నోచుకోలేదు.


 కానీ ఆ తర్వాత నవీన్ పోలిశెట్టితో తీసిన జాతి రత్నాలు మాత్రం ఊహించిన రీతిలో భారీ విజయాన్ని సాధించింది. ఇక ఇప్పుడు మిస్ షెట్టి మిస్టర్ పొలిశెట్టి దర్శకుడు పీ మహేష్ బాబు కూడా 2014లో రారా కృష్ణయ్య అనే సినిమాతో డైరెక్టర్గా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. సందీప్ కిషన్, రెజీనా జంటగా నటించిన ఈ సినిమా వచ్చినట్టు కూడా చాలామంది ప్రేక్షకులకు తెలియదు. అయితే 9 ఏళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు మిస్ షెట్టి మిస్టర్ పొలిశెట్టి అని సినిమాను నవీన్ తో తీసి ఇక మంచి విజయాన్ని అందుకున్నాడు డైరెక్టర్. ఇలా ఫ్లాప్ డైరెక్టర్స్ కి నవీన్ పోలిశెట్టి లక్కీ హీరోగా మారిపోయాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: