అయితే ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే.. ఇకమీదట మెగా నందమూరి కుటుంబాల మధ్య వార్ అనేది ఉండదని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే గత కొంతకాలంగా మెగా మరియు నందమూరి కుటుంబ సభ్యుల మధ్య మంచి స్నేహబంధం వాతావరణం ఏర్పడింది దాదాపుగా ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి rrr చిత్రంలో నటించడం జరిగింది. ఇక బాలయ్య ఆహా అన్స్టాపుల్ షోలో హో స్టుగా చేయబడుతున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి మరి ఒక్కొక్కసారి ఒక్కో ఎత్తున మాట్లాడుతూ ఉంటారు.
గత కొద్ది రోజుల క్రితం స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయగా అందుకు మద్దతుగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేయడంతో పాటు మొన్నటి రోజున సాయంత్రం వేళ జనసేన పార్టీ టిడిపి తో పొత్తు పెట్టుకొని మరి ఎన్నికలలో నిలవబోతోంది అంటూ తెలియజేశారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఇక మీదట ఎక్కడా కూడా నందమూరి మెగా ఫ్యామిలీ మధ్య వార్ వినిపించదు అన్నట్టుగా పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల కొంతమంది అభిమానులు సైతం చాలా నిరుత్సాహంతో ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి