అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయమై మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు స్టార్ హీరో స్టేటస్ ని తెచ్చి పెట్టిన సినిమా ఇదే. ఇక ఇదే సినిమాను బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో 'కబీర్ సింగ్'(Kabirsingh) అనే పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక తన తదుపరి సినిమాని బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో చేస్తున్న విషయం తెలిసిందే. 'యానిమల్'(Animal) అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీలో రణబీర్ ని రఫ్ అండ్ రగుడ్ లుక్ లో చూపించబోతున్నాడు దర్శకుడు సందీప్ వంగా. ఇప్పటివరకు బాలీవుడ్ లో లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న రణబీర్ ని 

ఈసారి ఊర మాస్ హీరోగా ప్రెజెంట్ చేయబోతున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆడియన్స్ లో క్యూరియాసిటీని క్రియేట్ చేయగా, రీసెంట్ గా వచ్చిన ప్రీ టీజర్ ఆ క్యూరియాసిటీని రెట్టింపు చేసింది. ఇక ఇప్పుడు 'యానిమల్' టీజర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే టీజర్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. రణబీర్ కపూర్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 28న 'యానిమల్' టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ టీజర్ కట్ చేసే పనిలో ఎంతో బిజీగా ఉన్నారట. టీజర్ లో రణబీర్ ఊర మాస్ యాంగిల్ ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. 

అర్జున్ రెడ్డిని మించేలా రణబీర్ క్యారెక్టర్ డిజైన్ చేశారట సందీప్ వంగా. అంతేకాకుండా టీజర్ తోనే సినిమా కథ ఎలా ఉండబోతుందో చూపించనున్నారట. దీంతో ఈ టీజర్ కోసం ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు.  ఈ సినిమాని ముందుగా ఆగస్టు 11న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం అవ్వడంతో రిలీజ్ ను డిసెంబర్ కి వాయిదా వేశారు. భద్రకాళి పిక్చర్స్, టి సిరీస్ సంస్థలు సుమారు రూ.100 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనిల్ కపూర్, బాబీ డియోల్, పరిణితి చోప్రా కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 1న విడుదల కానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: