టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి. కళ్యాణ్ కృష్ణ తో మెగా 156 సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఈ సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు. అనంతరం వశిష్టతో సైతం 157 సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యూ వి క్రియేషన్స్ ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసుకున్న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉంది మూడు లోకాలకు పంచభూతాల కు సంబంధించిన కథతో ఈ సినిమాని దర్శకుడు

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది. మొదటి సినిమా బింబిసారా వంటి పిరియాడిక్ డ్రామా తో భారీ విజయాన్ని అందుకున్న ఆయన ఈసారి అంతకుమించిన విజయాన్ని చిరంజీవితో అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే కేవలం కథ మాత్రమే కాకుండా కాస్టింగ్ సైతం మెగాస్టార్ చిరంజీవి రేంజ్ లోనే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో అనుష్క శెట్టి ని హీరోయిన్గా కన్ఫామ్ చేశారు అన్న వార్తలు వినిపించాయి. అయితే కథ నచ్చడంతో అనుష్క సైతం చిరంజీవితో ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు అనుష్కతో పాటు ఈ సినిమాలో మరొక హీరోయిన్ కూడా ఉంది అన్న వార్తలు వినబడుతున్నాయి. ఇక ఆ హీరోయిన్ కోసం ఐశ్వర్యారాయ్ ని అనుకుంటున్నాట్లుగా తెలుస్తోంది. తెలుగులో ఇప్పటివరకు ఆమె డైరెక్టర్ సినిమా చేసింది లేదు. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె ఇప్పుడు చిరంజీవి సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఒకవేళ ఇదే వార్త గనక నిజమైతే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విజయాన్ని అందుకోవడం ఖాయమని అంటున్నారు మెగా అభిమానులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: