మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మహానటి, కనులు కనులు దోచాయంటే, సీతారామం వంటి వరుస విజయాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయిపోయాడు. ఇటువంటి సూపర్ హిట్ సినిమాలు ఆయన నుండి వచ్చాయి కాబట్టి ఆయన సినిమాలంటే తెలుగు ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఇక పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 24న ఆయన నటించిన కింగ్ ఆఫ్ కొత్త సినిమా విడుదలైంది. మలయాళం లో కోత టౌన్ అని అర్థం. అయితే ఇప్పటికే ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో

 సెప్టెంబర్ 22న విడుదల కాబోతున్నట్లు పలు వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎటువంటి నిజం లేదు అని తెలిపారు. ఇప్పటివరకు సదరు ఓటిటి ప్లాట్ ఫామ్ నుండి ఎటువంటి సమాచారం లేదు. దీంతో ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రేపు అంటే సెప్టెంబర్ 22న విడుదల కావడం లేదు అని తెలుస్తోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అనుబంధంగా ఉన్న వర్గాలు తెలుపుతున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 28 లేదా 29న ఈ సినిమా ఓటీటీ లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.

థియేటర్స్ లో ఈ సినిమాని మిస్ అయిన చాలామంది ఈ యంగ్ హీరో అభిమానులు ఓటీపీలో చూసేందుకు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. దీంతో ఇప్పుడు విడుదల తేదీ మారడంతో అందరూ నిరాశ చెందుతున్నారు. ఇక అభిలాష్ జోషి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమా ఓ మోస్తారుగా ప్రేక్షకులను మెప్పించింది. కానీ ఈ సినిమాలో యాక్షన్స్ సీన్స్ మాత్రం అందరిని బాగానే ఆకట్టుకున్నాయి. గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా గా వచ్చిన ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించింది. కాగా గురు సినిమా ఫేమ్ రతికా సింగ్ ఒక స్పెషల్ సాంగ్లో సందడి చేసింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: