
వరుస ప్లాపులతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేడ్ ఔట్ అయిన శ్రీనువైట్ల తో సినిమా చేయడానికి అటు గోపీచంద్ రెడీ అయ్యాడు అన్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతుంది అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు మరో ఫ్లాప్ డైరెక్టర్ తో మూవీకి రెడీ అవుతున్నాడట గోపీచంద్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. యువి క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా రాబోతుంది అన్నది తెలుస్తుంది. అయితే రాధాకృష్ణ కుమార్ ఫ్లాప్ డైరెక్టర్ అయినప్పటికీ ఇక అటు గోపీచంద్ కు మాత్రం హిట్ ఇచ్చిన డైరెక్టర్.
వీరిద్దరి కాంబినేషన్లో జిల్ అనే సినిమా వచ్చింది. గోపీచంద్ కెరీర్ లోనే మోస్ట్ స్టైలిష్ గా కనిపించిన మూవీ ఇది. అయితే ఈ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ ఆ తర్వాత రాధాకృష్ణ కుమార్ పెద్దగా హిట్ కొట్టలేదు. ప్రభాస్ లాంటి హీరోతో రాధేశ్యామ్ అనే సినిమా తీసి డిజాస్టర్ కొట్టాడు. దీంతో అప్పటి నుంచి రాధాకృష్ణ కుమార్ కెరియర్ ఇబ్బందుల్లో పడింది. రాధేశ్యామ్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు రాధాకృష్ణ. ఇక ఇప్పుడు గోపీచంద్ తో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఇప్పటికే ప్లాపుల్లో ఉన్న గోపీచంద్ మరో ప్లాన్ దర్శకుడికి ఛాన్స్ ఇవ్వడంతో ప్లాఫ్యాన్స్ న్స్ కూడా షాక్ అవుతున్నారు. గత కొంతకాలం నుంచి ఫ్లాప్ దర్శకులకు చాన్స్ ఇవ్వడమే పనిగా పెట్టుకున్నాడు గోపీచంద్.